నాని చేతులమీదుగా ‘వేయి శుభములు కలుగు నీకు’ టైటిల్‌ పోస్టర్‌ విడుదల

శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను హీరో నాని గురువారం విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘హారర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. గత ముప్పై రోజులుగా ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతున్నాం. టైటిల్‌ పోస్టర్‌ను నాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. టైటిల్‌ తగినట్లుగానే విజయ్‌రాజాకు శుభారంభాన్ని అందించే సినిమా ఇదని దర్శకుడు అన్నారు. విజయ్‌రాజాకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకముందని శివాజీరాజా చెప్పారు.

ఈ చిత్రాన్ని తూము నరసింహా పటేల్‌ నిర్మిస్తుoడగా  రామ్స్‌ రాథోడ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో విజయ్‌రాజా తో జంటగా తమన్నా వ్యాస్‌ నటిస్తున్నారు.