ఉద్యోగాలిప్పించాలని రెల్లి కులస్థుల విన్నపము
రాజమండ్రి, తమ జాతిలో సుమారు 2000 మందికి పైగా యువత, మహిళలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. తమకు ముఖ్యంగా యువతలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నది. మా కుల వృత్తి అయినటువంటి అవుట్ సోర్సింగ్, ఎన్నో తరాల నుండి ఆ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని, అటువంటి తమకు రెల్లి జాతిలో పుట్టినా ఎటువంటి ఉద్యోగాలు రావడం లేదని, మీరు మా యందు దయ చూపి మాకు ఉద్యోగాలు ఇప్పించవలసినదిగా కోరుకుంటూ మీకు మేము వ్రాస్తున్న విన్నపము. మేము ఇంకా చాలా సమస్యలతో బాధపడుతున్నాము. అన్ని సమస్యలలో ఈ ఉద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నది. దయచేసి మీరు మా యందు దయ చూపించి ఉద్యోగాలు ఇప్పించవలసినదిగా కోరుకుంటున్నామని రాజమండ్రి సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణకి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-16-at-13.12.42-2-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-16-at-13.12.42-1-768x1024.jpeg)