తక్షణమే దొంగ ఓట్లను తొలగించండి: తిరుపతి జనసేన

  • దొంగ ఓట్లను తొలగిస్తున్నారా లేక ఉన్న ఓట్లను తొలగిస్తున్నారా..?

తిరుపతి, వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఓట్లను ఇంతవరకు మీరు ఎందుకు తొలగించలేదుఅని, ఆ సాకుతో ఉన్న మంచి ఓట్లను కూడా మీరు తొలగిస్తున్నారా అని, దీనిపై సమగ్ర విచారణ జరిగేలా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ను త్వరలోనే కలిసి జనసేన పార్టీ రిపోర్ట్ చేస్తుందని, అదేవిధంగా జిల్లాలోని సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి తక్షణమే దొంగ ఓట్లను తొలగించి ఉన్న ఓట్లను భద్రపరిచేలా చర్యలు చేపట్టాలని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, ముక్కు సత్యవంతుడు, బత్చెన మదు బాబు, కొండా రాజమోహన్, హేమ కుమార్, మునస్వామి, రాజేష్ ఆచారి, లక్ష్మీ, దుర్గదేవి, చందన, గుట్టా నాగరాజు, రమేష్, హిమవంత్, కిషోర్, మనోజ్, హేమంత్, పవన్, షరీఫ్, పురుషోత్తం, గల్లా ఆది, గోపి, విశ్వ, వంశీ తదితరులతో కలిసి శనివారం అన్నమయ్య కూడలి వద్ద నిరసనలలో భాగంగా కిరణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనను అడ్డుకునే ప్రయత్నంలో పోలీస్ అధికారులు జనసేన నాయకుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది, జనసేన నాయకుల వద్ద ప్లే కార్డ్స్, ఫ్లెక్సీలను వారు దౌర్జన్యంగా లాక్కొని దురుసుగా ప్రవర్తించడం జరిగింది.