దాసరి నాగరాజు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

విజయవాడ సెంట్రల్: 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ జనసేన నాయకులు దాసరి నాగరాజు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటాలకు నివాళి అర్పించి, జెండా ఆవిష్కరణ, వందన కార్యక్రమం జరిగింది. తదనంతరం పాదచారులకు మరియు 27వ డివిజన్ ప్రజలకు మిఠాయిలు పంచుతూ దాసరి నాగరాజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పగిడిపల్లి గిరీష్, రాజనాల శ్రీనివాస్, దుబ్బా అజయ్, దు స్టాలిన్, పసుపులేటి పిచ్చయ్య, మారాసు రమణ, జాని, కె.వి.టి.ఆర్ రాజేశ్వర రావు, మండల దినేష్ తదితరులు పాల్గొన్నారు.