సమాజానికి మీరే గౌరవం – కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం శనివారం కాకినాడ సిటి సహాయ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు ఆధ్వర్యంలో 44వ డివిజన్ మెహర్ నగర్ ప్రాంతంలో తోరం చిరంజీవి నిర్వాహణలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు సీనియర్ సిటిజన్స్ రాధాక్రిష్ణ గారి ఇంటికి వెళ్ళి కలుసుకుని వారియొక్క క్ష్యేమ సమాచారం తెలుసుకున్నారు. వారిని కలిసి వారు స్వతంత్రపోరాటం దగ్గరనుండీ నేటి ప్రస్తుత పరిస్థితులను వాతావరణాన్ని చూసారంటూ వారి అనుభవాన్ని జతచేస్తూ నేడు ప్రజల సంక్ష్యేమంలోను, పాలనలోను తీసుకొనవలసిన ముఖ్యమైన నిర్ణయాలను మెరుగైన సూచనలతో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళేందుకు తమ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో సూచించవలసినదిగా కోరుతూ వారికి పోస్టల్ కవరుని అందచేసి విఙ్ఞ్యప్తి చేసారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సీనియర్ సిటిజన్స్ అంటే అస్సలు గౌరవంగానీ, మర్యాద గానీ లేవనీ పెన్షన్ 3 వేల రూపాయలు చేస్తానని ఎన్నికలముందు వాగ్దానం చేసి ముఖ్యమంత్రి అయ్యాకా దఫదఫాలుగా పెంచుతానని చెప్పడం చూస్తే ఏరు దాటేముందు ఓడ మల్లన్న, ఏరు దాటాకా తెప్ప మల్లన్న అన్న చందంగా ఉన్నట్ట్లుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సీతారాం, గరగ శ్రీనివాస్, తాతపూడి చిన్మయశర్మ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.