ప్రభుత్వ భూములను రెవిన్యూ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నది: జనసేన మురళి

అనంతగిరి: ప్రభుత్వ భూములను అక్రమాలతో రెవిన్యూ శాఖ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని జనసేన మురళి ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేన మురళి మాట్లాడుతూ అధికార ప్రజా ప్రతినిధులు అనంతగిరి మండలం చిలకల గడ్డ పంచాయతీ నుండి అనంతగిరి వరకు గిరిజనేత్రుడు అక్రమంగా బినామిల పేరుతో నిర్మిస్తున్నా పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు రెవిన్యూ శాఖ సిబ్బంది తీరు. దీనిని బట్టి చూస్తూ ఉంటే అనంతగిరి మండలంలో జెడ్పిటిసి, ఎంపీపీ రెవిన్యూ సిబ్బంది ఎందుకు మౌనం వహిస్తున్నారని అనంతగిరి మండల ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతున్నది. అవినీతి మూలముననే అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. దీనిపై జనసేన తరఫున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలియపరుస్తున్నాను. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులు తప్ప గిరిజనేతరులు నిర్మింపకూడదు. కానీ ప్రజలు నమ్మి సిపిఎం పార్టీని జెడ్పిటిసిగా గెలిపించినప్పటికీ అక్రమాలు గిరిజనేతరుల నిర్మాణాలు ఎందుకు ఆగట్లేదు అనే జనసేన పార్టీ ప్రశ్నిస్తున్నది. అనంతగిరి మండలంలో నిజమైన గిరిజనులు ముటేషన్ అప్లై చేస్తే ఆన్లైన్ చేయడానికి కూడా సంవత్సరాలు పడుతుంది కానీ ఒక గిరిజనేతరుడు. బినామీ నిర్మాణం మాత్రం ఒక్క రోజులొనే పని జరిగిపోతుంది. చిలుకలగడ్డ పంచాయతీలో అక్రమ నిర్మాణం మీద ఫిర్యాదు వెళ్లిన పట్టించుకోరు. అనంతగిరి మండలంలో ఇప్పుడు బినామీ పేరుతో అక్రమ నిర్మాణం జరిగినా పట్టించుకోని రెవిన్యూ శాఖ సిబ్బంది. ఈ మధ్యకాలంలోనే అక్రమ నిర్మాణాలు చాలా గట్టిగా సాగుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకుని రెవిన్యూశాఖ సిబ్బందిపై మరియు జెడ్పిటిసి ఎంపీపీల మీద గిరిజనులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే 100 సార్లు రెవిన్యూ ఆఫీస్ చుట్టూ తిరగవలసి వస్తుంది. గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక్క రోజులోనే పని చేసి పెట్టి చూసీ చూడనట్టు కట్టిస్తున్నారు. రెవిన్యూ శాఖ సిబ్బంది దీనికి మండల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు పుష్కలంగా సహకరిస్తున్నట్టు తెలిసి వస్తున్నది. రెవిన్యూ ఆఫీస్ అవినీతిపై గిరిజనులు బహిరంగంగా మాట్లాడు కొంటున్నారు. గిరిజనుడు బ్రతుకుతెరువు కోసం ఏదైనా రోడ్డు పక్కన పాక వేస్తే ఆగ మేఘాల మీద నోటీసులు అంటిస్తున్నారు. కానీ బినామీ పేర్లతో గిరిజనేతరులు నిర్మిస్తూ ఉంటే రెవిన్యూశాఖ సిబ్బంది కొమ్ము కాస్తున్నారు జనసేన మురళి తెలిపారు.