రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రైస్ మిల్లర్లు: చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

  • రైతు ఏడ్చిన దేశం, రాష్ట్రం ఏదైనా బాగుపడిన చరిత్ర లేదు

హుజూరాబాద్: రైతులు పండించే ధాన్యం మీద బ్రతుకుతూ ఇప్పుడు వారి పంట, వారి జీవితాలతో రైస్ మిల్లర్లు చెలగాటం ఆడుటున్నారని జేనసేన కార్యకర్త చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కనుసన్నల్లో మిల్లర్లు నడుస్తూ, వారు చెప్పినట్టు రైతులు పండించిన ధాన్యం మిల్లు లోపలికి అనుమతించడం లేదు. 5 రోజులైనా ఒక్క ట్రాక్టర్ కూడా మిల్ లోపలికి పోలేదు. ఒక్క నియోజకవర్గంలో నేను చూసింది మీతో సమాచారం పంచుకుంటున్నాను. హుజూరాబాద్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమం వీటిపై చర్యలు ఏవి ?.. రైతు బ్రతుకు ఆగం చేస్తున్న ఈ దళారీ వ్యవస్థను అంతం చెయ్యాలి.. పవన్ కళ్యాణ్ అన్న గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం పడుతున్న గొసను చూడు. రాష్ట్ర జనసేన నాయకులకు విన్నపం… రైతు సమస్యల పరిష్కారం కోసం మీవంతు సహాయంగా ఈ చర్యను పత్రికల ముందు చెప్పి రైతు బాధను పంచుకుంటారని ఆశిస్తున్నానని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి తెలియజేసారు. బీహార్ నుండి వలస కూలీలను తీసుకువచ్చి రైతు కంట కన్నీటికి కారణం అవుతున్న ప్రతీ ఒక్కరికీ ఇదే మా హెచ్చరిక రైతు ఏడ్చిన దేశం, రాష్ట్రం ఏదైనా బాగుపడిన చరిత్ర లేదని చిట్టి ఉదయ్ కుమార్ హెచ్చరించారు.