ఘనంగా సింగర్‌ సునీత వివాహ వేడుక

ప్రముఖ టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత వివాహం మ్యాంగో రామ్‌తో నిన్న హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. అమ్మపల్లి దేవాలయాన్ని పెళ్లి మండపంగా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హీరో నితిన్‌లు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం సునీత వివాహానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గత కొంతకాలంగా సునీత వివాహానికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఆ గాసిప్స్ కు చెక్ పెడుతూ సునీత వివాహం జరిగింది.