పెరిగిన బంగారం ధరలు

కరోనా వైరస్‌తో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర పదిగ్రాముల బంగారం రూ. 49,931తో ప్రారంభమై రూ.50వేలు దాటింది.

కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తుండటంతో సురక్షితమైన పెట్టుబడికి బంగారం ఒక్కటే మార్గమని ఎక్కువమంది నమ్ముతుండటం వల్ల డిమాండ్‌ పెరిగిందని, అందుకే ధర ఈ స్థాయిలో పెరుగుతోందని నిపుణులు బావిస్తున్నారు.

ఇటు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్న ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.2,550 పెరిగి రూ. 60,400కు చేరుకుంది. మార్చిదాకా ఓ మోస్తరుగా ఉన్న బంగారం వెండి ధరలు ఒక్కసారి ఊపందుకున్నాయని, అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.