అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో.. తాడిపత్రి సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా తాడిపత్రికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చెక్ పోస్టుల వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.