అద్వాన స్థితిలో ముచ్చర్ల నుండి కొప్పెర్లకు వెళ్లే రోడ్డు

పెడన, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 15, 16, 17 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల అధ్వాన పరిస్థితిపై #GoodMorningCMSir ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయినింగ్ చేయాలన్నది పార్టీ ఆదేశం. జనసేన పార్టీ ఆదేశాల అనుసరించి కృష్ణాజిల్లా, పెడన మండలం, ముచ్చర్ల గ్రామం నుండి కొప్పెర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మయంగా ఉంది. ముచ్చర్ల గ్రామ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, సచివాలయానికి ఇదే రోడ్డు నుండి ప్రయాణం చేయాలి. రాత్రి సమయంలో వైద్య అవసరాల కోసం వెళ్లాలంటే నరకప్రాయంగా ఉంటుంది. వృద్ధులు స్కూల్ పిల్లలు ఈ రోడ్లపై ప్రయాణించలేక అవస్థలు పడుతున్నారు. కావున అధికార ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్లను మరమ్మతులు చేయించవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. నేలకొండపల్లి నుండి ముచ్చర్లకు వెళ్లే రోడ్డు కేవలం చెరువుల వరకే రోడ్లు వేయటం చూస్తుంటే జోగి రమేష్ కి చేపల చెరువుల మీద ఉన్న శ్రద్ధ ముచ్చర్ల గ్రామ ప్రజల మీద లేదు అనిపిస్తుంది. మంత్రి జోగి రమేష్ మట్టి దోపిడిపై పెట్టిన శ్రద్ధ రోడ్లపై పెట్టకపోవడం దురదృష్టకరం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, కూనసాని నాగబాబు, పండమనేని శ్రీనివాస్, మోటేపల్లి సురేష్, మోటేపల్లి దశరథరామయ్య, బండ్రెడ్డి రామ్మోహన్, ఆత్మూరి సాయి, మోటేపల్లి శివరామకృష్ణ, మోతెపల్లి వెంకటేశ్వరరావు, మోటేపల్లి శ్రీనివాస్, ఊస వెంకయ్య, శీరం సంతోష్, కనపర్తి వెంకన్న, సమ్మెట శివ, ర్యాలీ సత్యనారాయణ, కొప్పినేటి శివమణి, పాశం నాగమల్లేశ్వరరావు, దాసరి నాని, పినిశెట్టి రాజు పాల్గొనడం జరిగింది.