పంతం నానాజీ ఆధ్వర్యంలో రోడ్ల గుంతలకు జనసైనికుల శ్రమధానం

కాకినాడ రూరల్ నియోజకవర్గం, జనసైనికుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో గల తూరంగి బ్రిడ్జి అయ్యప్పస్వామి గుడిదగ్గర (తూరంగి నుండి నడుకుదురు వెళ్లే రోడ్డు)రహదారి పూర్తిగా పాడై పోయి ఉంది.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని వారి ద్రుష్టి కి తీసుకువెళ్ళలానే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు #GoodMorning CM sir అనే కార్యక్రమం ద్వారా పాడైపోయి ఉన్న రోడ్డు వద్ద శ్రమ దానం చేసే కార్యక్రమాన్ని చేపట్టి.. జనసైనికులతో కలిసి రోడ్డు శ్రమధానము కార్యక్రమంలో పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ రోడ్ లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరియు అనేకమంది ప్రమాదాలకు గురిఅవుతున్నారు. ఇటీవల ఇక్కడ రెండు పెద్దప్రమాదాలు తప్పాయని అదృష్ట వసాత్తు ప్రాణనష్టం జరగలేదు ఎవరికి.. ఎటువంటి ప్రమాదాలు జరగ కూడదు అనే ఉద్దేశంతో.. జనసైనికుల సహకారంతో వీలైనంత వరకు శ్రమదానం చేస్తున్నాము…. వైసీపీ ఆర్&బి మంత్రి 2200 కోట్లు నిధులు కేటాయించాం అందులో 60 శాతం నిధులు ఖర్చు చేసాము అని చెబుతున్నారు… దేనికి ఖర్చు చేసారో ఆయనకి తెలియదు.. వాళ్లే ఆ 60 శాతం నిధులు తినేసి ఉంటారు. ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్డు పాడైపోయివుంటుందా? రోడ్లు అనేవి వేయలేదు కాబట్టి జనసేన పార్టీ నిద్రపోతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మేల్కొలుపుతున్నాము. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వేయాలని లేదా కనీసం మరమ్మత్తులు అయినా చేయించాలని కోరుతున్నాము. లేని పక్షంలో రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు నిరసన తెలుపుతామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.