ముండ్లమూరివారిపాలెం రహదారి సమస్యను పరిష్కరించాలి: జనసేన డిమాండ్

*పొన్నలూరు మండలం, “ముండ్లమూరివారిపాలెం” గ్రామంలో విచిత్రమైన “చిత్తడి రోడ్డు”

*అది “రహదారో లేక నీటి కుంటో” అధికారులు మీరే చెప్పాలి…?

*”రోడ్డు మాత్రం చిన్నదే సమస్య మాత్రం చాలా పెద్దదే”

*”ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు” ప్రోగ్రాం మాదిరిగా “ఓటు వెయ్యి రోడ్డు వేయించుకో” అని బంపర్ ఆఫర్ ఇచ్చిన వైసీపీ నాయకులు

*వాలంటరీ నుండి ఎమ్మార్వో ఆఫీస్ దాకా తిరగని రోజు లేదు, అడగని నోరు లేదు, ఈ రోడ్డు గురించి ఇవ్వని అర్జీ లేదు,

*ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు

పొన్నలూరు మండలం, ముండ్లమూరివారిపాలెం గ్రామంలో మంగళవారం జనసేన మండల అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” పర్యటించడం జరిగింది. 50 ఇండ్లతో కలుపుకునిపోయే ఈ రహదారి కేవలం “అరకిలోమీటరు” కూడా ఉండదు. ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. ఈ 50 ఇళ్లలో ఉండే ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎన్నికల ముందు వైసిపి నాయకులు అధికారంలోకి రాగానే రహదారిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారు. ఈ రహదారిలో వర్షాకాలంలో అయితే అటు నుండి ఇటు.. ఇటు నుండి అటు వెళ్లడం మాత్రం సాధ్యం కాదు. ఎవరు ఇళ్లల్లో వాళ్ళు ఉండాల్సిందే. ఎండాకాలంలో కూడా ఈ రహదారి లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయంటే…? ఈ రహదారి గురించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అధికారులే చెప్పాలి…?

“బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ఉంటాయి” అన్నట్లుగా సమస్య ఎక్కడ ఉంటే ప్రశ్నించడానికి జనసేన పార్టీ అక్కడ ఉంటుంది. అతి తొందరలో ఈ రహదారి సమస్య పరిష్కరించకపోతే…? జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జిల్లా కలెక్టర్” దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.

మీరు ఈ రహదారిని నిర్మించలేము, మా వల్ల కాదు, అని బహిరంగంగా చెప్పండి.. ఆ తర్వాత మా సొంత ఖర్చులతో “జనసేన పార్టీ” ఆధ్వర్యంలో అతి తొందరలో కనీసం మట్టి రోడ్డునైనా వేసి కొంతమేరకు ప్రజలకు ఉపశమనం వచ్చే విధంగా చేస్తాము. ఇటీవల కాలంలో ఈ రహదారిలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి నీళ్లలో అడుగుపెట్టగానే పాముకాటుకు గురి అయ్యి ప్రమాదం నుండి బయటపడ్డాడు. అదే అతనికి ఏదైనా జరిగిఉంటే దానికి కారణం మాత్రం ఈ వైసీపీ నాయకులు కారణం అయ్యేవారు.

ఇప్పటికైనా అధికారులు మరియు నాయకులు మేల్కొని అతి తొందరలో ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని “జనసేన పార్టీ” నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గ్రామస్తులు అందరికీ “జనసేన పార్టీ” అండగా ఉంటుంది.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జోగేశ్వరరావు, మల్లికార్జున, మాలి, మహేంద్ర, వెంకట్రావు, మహేంద్ర, మాధవరావు, మురళి, మాల్యాద్రి, పంది మాల్యాద్రి, మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.