సొంత పార్టీ నేతలపై రోజా కీలక వ్యాఖ్యలు

నగిరి: ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైస్సార్సీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. వైస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైస్సార్సీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా విమర్శించారు.