ప్రతి పైసాకు లెక్క అడిగితే.. చెప్పలేక వ్యక్తిగతంగా విమర్శిస్తారా?

కళ్యాణ దుర్గం: ఎంత ఖర్చు పెట్టింది? ప్రజలందరికీ తెలియజేయాలి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి పైసాకు లెక్కలు చెప్పండి అని వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా కొంతమంది వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం, ర్యాలీలు చేయడం, పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, దారుణమైన మాటలు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం వంటివి చేశారు. అదేవిధంగా వైసిపి మంత్రులు పేర్ని నాని, అమర్నాథ్, బొత్స, ఆళ్ల నాని, దాడిశెట్టి రాజా, కాకాని, మిథున్ రెడ్డి వంటి వారు పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మిస్సింగ్ కేసులు 30 వేలు కాదు 1400 మాత్రమే అని, ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు ఈ రాష్ట్రంలోనే మీరు ఎందుకు లెక్కలు అడుగుతున్నారు అని, 10 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారిని అవగాహన లేకుండా విమర్శించడం జరిగింది. వీరందరికీ మేము ఈరోజు సమాధానం చెబుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్&బి గెస్ట్ హౌస్ నందు “జన సైనికుల ఆత్మీయ సమావేశం” ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కేవలం 1400 మంది కాదు 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, సుగాలి ప్రీతి హత్య కేసు గురించి ఇంకా పెండింగ్ లోనే ఉంది అది ఏం చేశారు, నిన్నటి రోజు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సరైన వేతనాలు లేవని నిరసన ర్యాలీలు చేశారు. వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి వ్యక్తిగత జీవితం గురించి ఆయన పెళ్లిళ్లు గురించి దారుణంగా విమర్శించారు, శింగనమలలో ఇద్దరు బాలికలను ముగ్గురు గ్రామ వాలంటీర్లు అపహరించి అత్యాచారం చేశారు. నెల్లూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేశాడు, గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒక గ్రామ వాలంటీర్ గిరిజన తల్లి కొడుకు ఇద్దరిపై వారి ఇంటిలోకి దూరి దాడి చేశారు, కళ్యాణదుర్గం మండలంలోని పాత కైరేవు గ్రామంలో ఒక అంగన్వాడీ కార్యకర్తపై గ్రామ వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 6 ఏళ్ల బాలికపై ఒక గ్రామ వాలంటీర్ అత్యాచారం చేశాడు, శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఒక దళిత యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం చేశాడు, చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఇంట్లో ఎవరూ లేని అనాధ బాలికపై ఇంట్లోనే గ్రామ వాలంటీర్ అత్యాచారం చేశాడు, ఒక మైనర్ బాలికపై 3 నెలలుగా గ్రామ వాలంటీర్ అత్యాచారం చేశాడు, అనంతపురం జిల్లాలో ఒక గ్రామ వాలంటీర్ మహిళకు రావలసిన పెన్షన్ డబ్బులు కాజేసి పరారయ్యాడు, బెలుగుప్ప మండలంలో సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామ వాలంటీర్లు అందరూ సచివాలయంలోనే మందు తాగి డాన్స్ చేశారు. రోజాకు మంత్రి పదవి వచ్చిన ప్రారంభంలో రాష్ట్రంలో ఒక వారంలోనే ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి రోజాగారు అని అడిగితే “రెండు మూడు రేప్ లకే ఇంత రాద్ధాంతమా”అని రోజా గారు మాట్లాడడం కరెక్టేనా?.. మీ ఇంట్లో ఆడ పిల్లలకు ఇలాగే జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా రోజా పువ్వు గారు. మీరు మహిళ రోజా కాదు బ్రోకర్ రోజా జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరిస్తున్నాము. ఇలాంటి వారిపైనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. మంగళవారం నిరసన చేసిన వాలంటీర్లందరికీ ఇవి తేలిదా?.. మీరు ఇప్పటికైనా మారకపోతే మీ బ్రతుకులు ఇంతే!. మీరు వైసీపీకి బానిసలు గానే ఉండిపోతారు. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు ఇవన్నీ నీకు కనిపించలేదా? ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీకు ఇంగిత జ్ఞానం ఉందా? అని అడుగుతున్నాము. అలాగే ఈ రాష్ట్ర వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు “కాగ్” నివేదిక ప్రకారం ఎంత అప్పు తీసుకున్నారు? ఎంత ఖర్చు పెట్టారు? ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చెప్పండి అంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని వ్యక్తిగతంగా విమర్శిస్తారా?.. మీరు మంత్రులు కాదు కంత్రిలు! ఇంకొకసారి జనసేన పార్టీ పైన కానీ పవన్ కళ్యాణ్ గారిపై అనవసరంగా వ్యక్తిగతంగా విమర్శిస్తే చోక్కాలు ఊడదీసి కొడతాము కబాడ్దార్! అని వాలంటీర్లను, వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులను, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మను మేము కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ కార్యదర్శులు రాయుడు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ నాయకులు వంశి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల నాయకులు కాంత్ రాజు, జిల్లా జనసేన వీరమహిళ షేక్ తార, విట్లంపల్లి ముక్కన్న పాల్గొనడం జరిగింది.