ఆర్టీసీ చార్జీలు తగ్గించాలి

*ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేపట్టిన జనసైనికులు
పార్వతీపురం, ప్రభుత్వం ఇటీవల డీజిల్ సెస్ పేరుతో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసైనికులు ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు చందక అనిల్, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, బోనెల గోవిందమ్మ, పైల లక్ష్మీ, ఆగురు మణి, అంబటి బలరాం నాయుడు, మనేపల్లి ప్రవీణ్, పైల శ్రీను, బోనెల చంటి, ఆగూరు కేశవరావు, చిట్లీ గణేష్ తదితరులు ఆర్టీసీ డిపో వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు… జగన్ రెడ్డి బాదుడు పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన చార్జీలను తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే… బాదుడు అంటూ శోకాలు తీసేవారని, ఇప్పుడు ఆయన బాదుతున్న ధరల బాదుడు ఏంటని ప్రశ్నించారు. పేదవాడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ చార్జీలు పెంచి వారిపై భారం వేయడం సరికాదన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పరిస్థితి దారుణమన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఏసి బస్సులో 2,5,10 రూపాయల చొప్పున పెంచి ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుదలతో పాటు కరెంటు, డీజిల్, పెట్రో ధరలు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తక్షణమే ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని అన్నారు. ఈ క్రమంలో వారు అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.