రెండు వారాల్లో రష్యా ‘స్పూత్నిక్ వి’ సప్లై కి రెడీ

ప్రపంచానికి తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అందించిన రష్యా ఇంకో శుభవార్త తెలిపింది. తాము తయారు చేసిన స్పూత్నిక్ వి అనే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన తొలి బ్యాచ్ ను రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మురాష్కో బుధవారం ఒక ప్రకటన చేశారు. స్పూత్నిక్ వి గురించి మాట్లాడిన ఆయన కోవిడ్-19కు తట్టుకునేందుకు ఇమ్యూనిటీ ఉన్న 20 శాతం మంది వైద్యులకు ఈ వ్యాక్సిన్ అవసరం లేదు అని ఆయన అన్నారు. అయితే ప్రయారిటీ విషయాలు వైద్యులకే వదిలేశాం అన్నారు.

స్పూత్నిక్ వి వ్యాక్సిన్ తో ముందు రష్యా అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ఎగుమతులు కూడా  ప్రారంభిస్తాం అన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలు తన తొలి ప్రాధాన్యత అన్నారు.