భారత్‌కు చేరిన రష్యా కరోనా వ్యాక్సిన్.. ట్రయల్స్ ప్రారంభం..

కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయోగాల్లో అందరి కంటే ముందున్న రష్యా వైరస్ కు మొదటి టీకాను రష్యా తయారు చేసింది. స్పుత్నిక్ వి పేరుతో ఈ టీకాను మార్కెట్లోకి ఇప్పటికే రిలీజ్ చేసింది. అయితే, ఈ టీకాకు సంబంధించిన ఎలాంటి డేటాను ఆ దేశం బయటకు ఇవ్వకపోవడంతో టీకాపై ప్రపంచదేశాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మూడోదశ ట్రయల్స్ ను రష్యా నిర్వహించింది. 92శాతానికి పైగా టీకా విజయం సాధించినట్టు ఇప్పటికే ఆ దేశం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటె, ఈ టీకా ఇప్పుడు భారత్ కు చేరింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒప్పందం భారత్ లో హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ తో కుదుర్చుకుంది. రెడ్డీస్ ల్యాబ్స్ కు ట్రయల్స్ కు సంబంధించిన డోస్ లు చేరినట్టుగా రష్యా వెల్లడించింది. ఈనెల 15 వ తేదీ తరువాత 2,3 వ దశలకు సంబంధించిన ట్రయల్స్ ను ప్రారంభించబోతున్నారు. ట్రయల్స్ ట్రయల్స్ అనంతరం ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తుంది.

కరోనా వ్యాక్సిన్ ను నమోదు చేసిన తొలి దేశంగా రష్యా రికార్డు సృష్టించింది. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను భారత్‌లో అభివృద్ధి చేయడంతో పాటు పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబ్‌తో రష్యా ఒప్పందం ప్రకారం 100 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులను భారత్‌కు పంపనుంది. వీటితో రెడ్డీస్‌ ల్యాబ్‌ రెండు, మూడు దశల ట్రయల్స్‌ చేపట్టనుంది. మూడో దశ ట్రయల్స్‌ వచ్చే ఏడాది మే నాటికి పూర్తవుతాయని అంచనా. స్పుత్నిక్‌ వీ దీర్ఘకాలం పాటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుందని రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఇది కనీసం రెండేళ్ల వరకూ కరోనా రాకుండా అడ్డుకోగలదని భావిస్తున్నారు.