ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్..

ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 షెడ్యూల్ బుధవారం నాడు విడుదల చేశారు. జూన్‌ నెల 7వ తేదీ నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

జూన్ ఏడో తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది ఏడు పేపర్లుగా నిర్ణయించారు. టెన్త్ క్లాస్ బోర్డు పరీక్షలలో సైన్సులో మాత్రమే రెండు పేపర్లు ఉంటాయన్నారు.

ఏపీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ 2021 షెడ్యూల్‌:

జూన్‌ 7    సోమవారం       ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8    మంగళవారం     సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9    బుధవారం        ఇంగ్లీష్‌

జూన్‌ 10 గురువారం        మ్యాథమేటిక్స్

జూన్‌ 11 శుక్రవారం         ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 శనివారం          బయాలజీ

జూన్‌ 14 సోమవారం       సోషల్‌ స్టడీస్‌

జూన్‌ 15 మంగళవారం     ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌2, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్, సంస్కృతం, అరబిక్‌, పర్షియన్

జూన్‌ 16 బుధవారం        ఒకేషనల్‌ కోర్స్ (థియరీ)

జూన్‌ 5వ తేదీ వరకు 10వ తరగతి విద్యాలు క్లాసులు జరగుతాయని చెప్పారు. అదే విధంగా జూలై 21వ తేదీ నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తరువాతే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయని తెలిసిందే.