సైదాపురం జనసేన ఉపాధ్యక్షులు ప్రసన్న ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి

  • ఇంటి అద్దాలు బైక్ ధ్వంసం చేసిన వైసీపీ మూకలు

వెంకటగిరి నియోజకవర్గం: వెంకటగిరి పరిధిలోని సైదాపురం రాగన రామాపురం గ్రామంలో సోమవారం జనసేన పార్టీ సైదాపురం ఉపాధ్యక్షుడు ప్రసన్న మరియు అతని కుటుంబ సభ్యులపై కొందరు వైసిపికి చెందిన వారు దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. బాధితుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సైదాపురం గ్రామంలోని ఒక డాబాలో ప్రసన్న స్నేహితుని వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ప్రసన్నతో పాటు పలువురు వైసీపీకి చెందిన వ్యక్తులు కూడా పాల్గొన్నారు. విందు జరుగుతున్న సమయంలో విందులో పాల్గొన్న వారి మధ్య గొడవ మొదలైంది. వారికి సర్ది చెప్పే సమయంలో ప్రసన్నపై వైసీపీకి చెందినవారు దాడి చేయగా వారి నుండి తప్పించుకొని రాగన రామాపురం ప్రాంతంలో ఉన్న అతని నివాసానికి ప్రసన్న చేరుకున్నాడు. కొద్దిసేపు తర్వాత అతనిపై దాడి చేసిన వారు తిరిగి ఇంటి వద్దకు వచ్చి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడి ప్రసన్న కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడుతూ వారిపై దాడి చేసి గాయపరిచారు. అదే విధంగా ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టి మోటర్ సైకిల్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సైదాపురం పోలీసులు మాత్రం వైసిపికి చెందిన వ్యక్తులకు అండగా నిలిచి ప్రసన్న మరియు అతని తల్లి, అక్క, ఆమె ఇద్దరు కుమారులపై 307,323, ఆర్/వ్ 34 ఐపీసీ సెక్షన్స్ కేసులు కట్టారు. సోమవారం రాత్రి ప్రసన్నతో పాటు విష్ణు, భరత్లను సైదాపురం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడే ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున ప్రసన్నకు ఫిట్స్ రావడంతో గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి పోలీసులు ప్రసన్నను తీసుకువచ్చారు. అక్కడ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు, లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్రశేఖర్ ఆసుపత్రికి చేరుకొని మీ కస్టడీలో ఉన్న ప్రసన్నకు ఆరోగ్యం విషమంగా ఉంటే గూడూరు ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రసన్నను అంబులెన్సు ద్వారా నెల్లూరుకు తరలించారు. సైదాపురం పోలీసులు వైసిపి పార్టీ వారికి అండగా నిలబడి దాడికి గురైన ప్రసన్నను మరియు అతని కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి స్టేషన్లో ఉంచారని, ప్రసన్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును విచారించ కుండా వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం సరైన పద్ధతి కాదనన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, చట్ట పరంగా ముందుకెళ్తామని ఆయన తెలిపారు.