సఖినేటిపల్లి జనసేన మండల కమిటీ ప్రమాణస్వీకారోత్సవం

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మోరి వి కన్వెన్షన్ పంక్షన్ హాల్ లో మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్ అద్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షులు, పీఏసీ సభ్యులు మరియు నరసాపురం ఇంచార్జీ బొమ్మిడి నాయకర్, జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, రాష్ట్ర మాత్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ, ముఖ్యనాయకులు లింగొలు సత్యనారాయణ, గుందుబోగుల పెద్ద కాపు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, పినిశెట్టి బుజ్జి, రావూరి నాగు, ఉండపల్లి అంజి, బైరా నాగరాజు, చొప్పల బాబురావు, నియోజకవర్గ నాయకులు, సర్పంచ్ లు ఎంపీటీసీలు, వీర మహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.