గంధం ఆనంద్ ఆధ్వర్యంలో సంపత్ నాయక్ జన్మదిన వేడుకలు

*ఉమ్మడి ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ ఆధ్వర్యంలో తెలంగాణ జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. సంపత్ నాయక్ జన్మదిన వేడుకలు

తెలంగాణ జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. సంపత్ నాయక్ జన్మదిన వేడుకలు సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. డా.సంపత్ నాయక్ జన్మదిన వేడుకలు సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ యంగ్ అండ్ డైనమిక్ లీడర్.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి విభాగంలో దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు.. విద్యార్థుల పట్ల ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వంపై ఎదురు తిరుగుతూ పోరాడే నాయకుడు.. తెలంగాణ జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. సంపత్ నాయక్ అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆడ బిడ్డలకు అన్యాయం జరిగితే అండగా నిలబడుతూ.. ఇలానే జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరుపున విద్యార్థుల సమస్యల పట్ల పోరాడుతూ.. పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తూ.. తెలంగాణలో అనేక సమస్యల పైన ప్రశ్నించే గొంతుకతో పోరాడుతూ.. ఉన్న నాయకులు మీలాంటి దమ్ము ఉన్న నాయకుడిని నేను అసెంబ్లీ స్థాయికి ఎదుగుతారు అని.. అసెంబ్లీలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను అన్నయ్యా అని తెలియజేసారు. .. ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులు పల్లె భరత్ చందన్, వేల్టూరి కుమార్, బండే బోయిన శివ ప్రసాద్, కట్టెల శివ ప్రసాద్ యాదవ్, మహేందర్ తదితరుల పాల్గొన్నారు.