క్యాన్సర్‌ను జయించిన సంజయ్‌

ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడిన  బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను జయించారు. తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఇదేనని పేర్కొన్నారు.

‘కొన్ని వారాలు పాటూ నాకు, కుటుంబ సభ్యులకు ఎంతో కష్టంతో కూడుకున్నది. దృఢమైన వారు ఎక్కువ పోరాడేలా దేవుడు పరిస్థితుల్ని సృష్టిస్తాడని అందరూ అంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరిగింది. ఇవాళ నా పిల్లల పుట్టినరోజు.. ఈ సందర్భంగా నేను క్యాన్సర్‌తో పోరాడి, జయించానని చెప్పడం సంతోషంగా ఉంది. నా ఆరోగ్యాన్ని పిల్లలకి కానుకగా ఇస్తున్నా’.

ఈ విషయంలో నా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు రుణపడి ఉన్నా. మీరు నాపై కురిపించిన అమితమైన ప్రేమకు థాంక్స్‌. ‘ మీ మద్దతు, ప్రార్థనలు లేకపోతే నేను దీన్ని సాధించగలిగేవాడ్ని కాదు. ప్రత్యేకించి నాకు చికిత్స చేసిన కోకిలబెన్‌ ఆసుపత్రి వైద్యులు శావంతి, బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’ అని సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు.