నరవ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు

పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామంలో స్ధానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ అధ్యక్షతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే సంక్రాంతి సంబరాలులో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీ, పిల్లలకు సంగీతం పోటీ, భరతనాట్యం, పిల్లల వేషధారణ, వంటి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీర మహిళలు పిన్నంటి పార్వతి, కర్రీ మౌనిక, వబ్బిన మీనాక్షి పాల్గొన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి నరవ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రోజురోజుకీ గ్రామ ప్రజల నుంచి మహిళ నుంచి మాపై చూపిన అభిమానం పెరుగుతూ వస్తుందని ఇంత చక్కనైన కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దీని వెనకాల ఎంతో మంది జనసైనికులు కష్టం ఉందని వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పిల్లలు చక్కనైన సంగీత స్వరాలతో మమ్మల్ని అలరింప చేశారు. ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ నృత్యాలతో మమ్మల్ని ఆకట్టుకున్నారని వారి గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జనసేన పార్టీ అంటే గ్రామంలో ప్రతి కార్యక్రమానికి మా మద్దతు ఉంటుందని గ్రామ అభివృద్ధిలో మా భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని ఈరోజు పవన్ కళ్యాణ్ నాలుగో సిద్ధాంతమైన సంస్కృతులను కాపాడే సమాజంలో భాగంగా ఈ సంబరాలు ప్రతి యేటా జరుపుతామని మా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్య అతిథులు పిన్నంటి పార్వతి మాట్లాడుతూ ముగ్గుల పోటీలో విజేతలను నిర్ణయించడం చాలా కష్టతరమైన పని అయిందని ప్రతి మహిళ పోటాపోటీగా ముగ్గులు వేయడం జరిగిందని చిన్నచిన్న విషయాలు పరిగణన తీసుకొని మొదటి, రెండవ, మూడవ విజేతలుగా నిర్ణయించాము అని ఇక్కడికి విచ్చేసిన మహిళలందరినీ కూడా విజేతలుగా నిర్ణయించి బహుమతులు ఇవ్వడం చాలా ఆనందదాయకమని ఈ గ్రామంలో ప్రతి సమస్య పై శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గళం వినిపిస్తుందని, మొదటి బహుమతిగా గెలిచిన రేవతి కి, రెండో బహుమతి గెలిచిన లీల కుమారి కి, మూడో బహుమతి గెలిచిన లక్ష్మీ కి అభినందనలు తెలియజేసుకుంటున్నామని మాట్లాడడం జరిగింది. కర్రీ మౌనిక మాట్లాడుతూ ముగ్గులు పోటీతో పాటు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ఆలోచించబడిన విషయమని, ఇదే స్ఫూర్తి అన్ని గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామాలలో ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఇంత మంచి ఆలోచన ఉన్న జనసేన పార్టీకి మరియు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు గురువులైనటువంటి గంతకూరు విజయ కి ఆరాధన చిల్డ్రన్ హోమం అమ్మ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అని మాట్లాడటం జరిగింది. వబ్బిన మీనాక్షి మాట్లాడుతూ మా నరవ గ్రామంలో నాలుగోసారి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు మరియు గెటప్స్ వేసుకొని వచ్చిన చిన్న పిల్లలకు, సంస్కృతి కార్యక్రమాలు వేసిన పిల్లలకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ కార్యక్రమాల్లో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సన్మానం చేయడం మంచి విషయంగా పరిగణిస్తున్నామని, అరకొర విద్యా వ్యవస్థలు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి సమాజానికి తెలియజేయడానికి ఇటువంటి సంబరాల్లో ఉపయోగ పడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని వారికి వారి తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఏటా మీరు ఇదే విధంగా జనసేన పార్టీని సపోర్ట్ చేసినట్లయితే ఇంతకన్నా వైభవంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని దీనికి సహకరించిన జనసైనికులకు, వీర మహిళలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డునాయుడు, బొబ్బర శ్రీను, గవర శీను, పట్నాల శివ, బొండాల రవికిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.