నరసాపురంలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో అలాగే వీరమహిళలు బొమ్మిడి సునీత, పోలిశెట్టి నళిని, తోట అరుణ, వలవల సావిత్రి, పిప్పళ్ల సుప్రజ, బొమ్మిడి విశాలి, మోటుపల్లి కిరణ్మయి, జడ్డు స్వాతి, వర్ధినేని పద్మావతి, కటికిరెడ్డి సింధు, కొప్పాడి మీన గార్ల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో ఇంతటి ఘనమైన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.