విజయవాడ జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి పాశం సుజాత ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊరు – మన ఆట ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.. ఈ పోటీలలో వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వీరమహిళలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, మేకల సుభాషిణి, 12వ డివిజన్ అధ్యక్షురాలు నీరజ, 21వ డివిజన్ అధ్యక్షులు పోతిరెడ్డి రమణ, 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్, 14వ డివిజన్ అధ్యక్షులు యడ్లపల్లి నాగరాజు, 13వ డివిజన్ అధ్యక్షులు రామాయణపు కోటి, ఉపాధ్యక్షురాలు కె.రాజేశ్వరి, రామాయణపు సాంబయ్య, వేమ నగేష్ తదితరులు పాల్గొన్నారు.