మైనింగ్ పై ఎస్టి కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు కన్ను: సి.హెచ్ మురళి

మైనింగ్ పై ఎస్టి కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు కన్ను ఉందని సి హెచ్. మురళి అనంతగిరి జనసేన పార్టీమండల అధ్యక్షులు సి హెచ్. మురళి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమైనింగ్ పేరుతో గిరిజనులను మోసం చేసిన కుంభ రవి బాబు ఆయన కాంగ్రెస్ పార్టీలో 2004 సంవత్సరాలలో ఎస్ కోట నియోజకవర్గం నుంచి కుంభ రవిబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పటినుంచి 5వ షెడ్యూల్ ప్రాంతాలలో గల ఉన్న ఖనిజ సంపద పై దృష్టిపడింది. అప్పటినుంచి మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వాలసీ పంచాయతీలో గల నిమ్మలపాడు కరకవలస రాళ్లగరువు వ్యవసాయ భూములను ఏపీఎండీసీ అధీనంలో వెళ్లడానికి రవిబాబే కారణం తరువాత ఏపిఎండిసి ఆధ్వర్యంలో మైనింగ్ లీజును దూరియా రుక్మిణి పేరుతో 110 ఎకరాలకు తీసుకున్నారు. దురియ రుక్మిణి అనే ఆమె రవిబాబు బినామి – మైనింగ్ నిమిత్తం రవిబాబు వివిధ పార్టీలను మారుతూ కాపాడుకొని వచ్చారు. మైనింగ్ లీజును ఎవరికి దక్కకుండా చేసింది రవిబాబు. మైనింగ్ నిమిత్తం ఆయా పార్టీల పెద్దలతో రవి బాబు సంప్రదింపులు జరిపేవాడు. చివరిగా వైసీపీ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ అధికారంలోకి రాగానే పాత టెండర్ రద్దు చేయించి కొత్త టెండర్ తెరపైకి తెచ్చారు. కొత్త టెండర్ కూడా రవిబాబు బినామీ అయిన దురియా రుక్మిణి రోబ్బ శంకర్రావు పేరు మీదనే ఏపీఎండీసీ దగ్గర టెండర్ తగ్గించుకున్నారు. కొత్త టెండర్ సుమారు 110 ఎకరాలు. మైనింగ్ కు ఆనుకొని నిమ్మలపాడు రాళ్లగరువు కరకవలస గ్రామాలకు చెందిన సుమారు 200 కుటుంబాల గిరిజనులు జీవిస్తున్నారు మైనింగ్ కార్యకలాపాలతో సుమారు 100 ఎకరాల పైబడి గిరిజనులు నష్టపోతున్నారు. వ్యవసాయ భూములు కావడం గిరిజనులకు జీవనాధారం ఆ భూములే మైనింగ్ తవ్వకాలు చేపట్టడంతో ఆయా గ్రాముల గిరిజనలు బ్రతుకులు అయోమయంగా మారాయి దీనిపై ఆయా గ్రామాల గిరిజనులు అగ్రహంతో ఉన్నారు. భూములు కోల్పోవడంతో గిరిజనులు చావే చరణ్యంగా భావిస్తున్నారు. అలాగే చట్టలకు తూట్లు పొడిచిన రవి బాబు, ఆదివాసి గుండెకాయ లాంటి 1996లో వచ్చిన ఫీసా చట్టాన్ని తన మైనింగ్ కార్యకలాపాల నిమిత్తం తన అపార యదస్సు రాజకీయ అధికార బలంతో తూట్లు పొడిచారు. గ్రామ సభలు పెట్టకుండానే నిమ్మలపాడు మైనింగ్ నిమిత్తం పిసా చట్టం &&& చట్టాన్ని తన రాజకీయం బలంతో తొక్కరు. పీసా గ్రామ సభకు వ్యతిరేకంగా మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. దీనిపై రవిబాబు మీద ఉత్తరాంధ్రలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు అగ్రహంతో ఉన్నారు. దీనిపై నిమ్మలపాడు రాలాగరువు కరకవలస గ్రామ గిరిజనలు తిరుగుబాటు చేస్తున్నారు. పదవులను అడ్డం పెట్టుకొని గిరిజన జాతికి మోసం చేయడం తప్ప ఐదవ షెడ్యూల్లో ఉన్న గిరిజనులకు మేలు చేసిన దాఖలు లేవు స్వార్థపూరితంగా వాడుకుంటూ విభజిస్తున్నాడు. సొంత ప్రయోజనాల కోసమే కార్యకలాపాలు బినామీ పేర్లతో నడుపుతున్నాడు. అన్ని జనసేనపార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు ఆరోపించారు.