గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు మండలంలోని తోట వెంగణ పాలెం గ్రామంలో గ్రామ జనసేన అధ్యక్షులు కూటాల వెంకటరామయ్య మండల కార్యదర్శి కూటాల పవన్ పాల్గొని సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బొట్టుకు రమేష్, కురిచేడు మండల జనసేన అధ్యక్షులు మాద శేషయ్య, జనసేన నాయకులు ఏసు రెడ్డి, గరికపాటి పుల్లయ్య, తాళ్లూరు మండల వీరమహిళ సుజాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని వారి సమస్యలను బొట్టుకు రమేష్ గారికి విన్నవించుకున్నారు. వారు జనసేన టిడిపి అలయన్స్ మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తామని తప్పకుండా మనకే ఓటు వేయాలని ఇప్పుడు ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పడం జరిగింది. అనంతరం ముగ్గుల పోటీలను తిలకించి గరికపాటి వెంకట్ తరపున బహుమతులు అందజేయటం జరిగింది. రమేష్ మరియు వారి వెంట వచ్చిన జనసేన మిత్రులందరికీ తాళ్లూరు మండల జనసేన అధ్యక్షుడు కూటాల ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.