బిఈఏఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

నెల్లూరు జిల్లా, కావలి బిఈఏఎస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అసోసియేషన్ క్యాలెండర్ ను జనసేన పార్టీ, కావలి నియోజకవర్గ ఇంఛార్జి.. అళహరి సుధాకర్ ఆవిష్కరించారు. కావలి బిఈఏఎస్ (బలిజ ఎంప్లాయిస్ అసోసియేషన్ సేవాసమితి) ప్రభుత్వ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ వారి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ అళహరి సుధాకర్ ఆవిష్కరించడం జరిగింది. మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఫర్ స్టేట్, కొండపల్లి శ్రీనివాసులు వారి నూతన సంవత్సర డైరీని అళహరి సుధాకర్ కి అందించడం జరిగింది. బిఈఏఎస్ తరుపున ఈ కార్యక్రమములో పాల్గొన్న చలపతి, తోట వెంకటేశ్వర్లు, పాసం శ్రీనివాసులు, పాసం రమేష్, అళహరి ఆది నారాయణ మూర్తి, తిరుమల, కొండపల్లి శ్రీనివాసులు, నామల చంద్రశేఖర్, రమేష్ తదితరులు మరియు జనసేన నాయకులు, వెంకయ్య, సుధీర్, శరణ్, కృష్ణయ్య, శ్రీను, నవీన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.