రైతు భరోసా యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం వేంకటాచలం మండలం సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన అధ్యక్షులు జనసేనని పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న 3000 వేలమంది కౌలు రైతుల కుటుంబాలకు అండ ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు నిధిని అందజేసే వారి కుటుంబాలకి వారి బిడ్డలకు చదువులకి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చే రైతు భరోసా యాత్రను కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయాలని అదేవిధంగా రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి తెలుపుతూ కొనసాగుతున్న రైతు భరోసా యాత్రకి సంబంధించి గోడ పత్రికను సోమవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ గోడ పత్రికను సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలలో ప్రతి పంచాయతీలో కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా అందిస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రహీం, రవికుమార్, సందీప్, శ్రీహరి, శివ కుమార్, రాకేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.