జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరుపేద అమ్మాయి వివాహం

కృష్ణాజిల్లా కొండూరు మండలం కొండూరు గ్రామములో నివసించే చాట్లపల్లి రాము స్వప్న నిరుపేద కుటుంబం వాళ్ళ అమ్మాయి పేరు త్రివేణి కష్టపడి డిప్లమా వరకు చదివించారు, మంచి సంబంధం వచ్చింది అమ్మాయికి పెళ్లి చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పరిస్థితులు బాగులేక ఈ విషయం తెలుసుకున్న కొండూరు జనసేనపార్టీ నాయకులు బత్తిన శ్రీనివాసరావు పెళ్లి బాధ్యత తీసుకున్నారు పెళ్లికూతురు తల్లిదండ్రులకు 70,000/- రూ నగదు ఇతర ఖర్చులు భోజనాలకు, పెళ్లి మండపం, సన్నాయి మేళాలకు అన్ని కలిపి ఇంకో 1,00,000 లక్ష రూపాయలు. మొత్తం 1,70,000/- అక్షరాల లక్ష డబ్భై వేలు ఖర్చు చేస్తున్నారు పెళ్లి తేదీ 11/5/22 అనగా బుధవారం రాత్రి 10:14 నిమిషాలకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఈ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ కి కూడా తెలియజేసారు. శ్రీకాంత్ తనవంతు సహాయం 10,000/- వేలు రూపాయలు మరియు 50 కేజీల బియ్యం 10 కేజీల కందిపప్పు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు శ్రీనివాసరావు పులి ప్రకాష్ చేతులు మీదగా ఇవ్వడం జరిగింది. ఈ పెళ్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లికి జనసేనపార్టీ అండగా ఉంటాం దగ్గర వుండి జనసేనపార్టీ నాయకులు అందరు కలిసి ఈ పెళ్లి చేసి అత్తగారి ఇంటికి పంపిస్తామని జనసేనపార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామమోహన రావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, కృష్ణాజిల్లా నాయకులు పులిపాక ప్రకాష్, మైలవరం నియోజకవర్గ నాయకులు బత్తిన శ్రీనివాసరావు,. యర్రంశెట్టి నాని, నరసింహరావు, శ్రీనివాసరావు, పార్థసారధి, రామాంజనేయులు, ప్రసాద్, కొండూరు మండల నాయకులు పాల్గొన్నారు.