జగనన్న లేఔట్లను పరిశీలించిన సర్వేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో జగనన్న లేఔట్లను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలమైన పొదలకూరు టౌన్ కి కూత వేటు దూరంలో ఉన్న చిట్టేపల్లి తిప్ప మీద జగనన్న లేఔట్ వేసి అందులో పేదలకి స్థలాలలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చారు. వాటిలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకున్న దాఖలు లేవు. సొంత మండలంలో తన అనుచరులు ఇంత అవినీతి చేస్తుంటే వారిపైన పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సర్వేనెంబర్ 707లో మొత్తం 1650 ప్లాట్లు వేసి ఉన్నారు. అవి మనం చూసినట్లయితే మొత్తం కూడా పిచ్చి చెట్లతో కముకోపోయి ఉన్నాయి. అయితే ఈ లేఅఔట్ లో రోడ్లు అంటే మట్టి రోడ్లు వేయడం కోసం అని చెప్పి రూ.ఐదు కోట్ల రూపాయల బిల్లు పెట్టారు. అందులో మూడు కోట్ల రూపాయలు మంజూరు అయ్యింది. ఇక్కడ చూస్తే ఇది పేదలకు ఇచ్చేది అనిపించే విధంగా ఉండడం, మరి కనీసం మట్టి రోడ్లు కాదు కదా అనువైన రోడ్లు వేయడం గాని, ఈ లేఔట్ ని పూర్తిస్థాయిలో పేదలకు అందించే విధంగా జరగలేదు. కానీ మూడు కోట్ల రూపాయలు బిల్లులు ఎలా చేస్తారు. మరి ఈ మూడు కోట్లు ఎవరి ఖతాకి చేరింది. పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల్లో పేరుకు మాత్రం పేదలకు తెరవెనక చూస్తే కోట్ల రూపాయల అవినీతి ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని చూస్తే మరి మా మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి. మంత్రి పేదలకు ఇచ్చే ఇళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా తిప్ప మీద ఉన్నటువంటి ఆ మట్టిని లోడి ఆ మట్టి రోడ్లు పోస్తున్నారు. మరి ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం అంటే ఏంది మరి ఇంత అవినీతి ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచుకుంటున్నారా. పేదల పేరుతో దోచుకోవడం కాదు. అభివృద్ధి చేసి చూపించండి. మేము ఒకటే కోరుతా ఉన్నాం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు కోట్ల రూపాయల అవినీతి. ఈ అవినీతికి పాల్పడే వారిపై ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్.
ఈ కార్యక్రమంలో రహీం భాయ్, సుధాకర్, వెంకయ్య, రవి, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.