మాడుగుల జనసేన ఆధ్వర్యంలో యువశక్తి గోడ పత్రిక ఆవిష్కరణ

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు యువశక్తి కార్యక్రమానికి ప్రచారకర్త అయినటువంటి రెడ్డి అప్పల నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ యువశక్తి కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ, గుమ్మడి శ్రీరామ్ మరియు నియోజకవర్గ వీర మహిళ వీరా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు జనసేన నాయకులు మాట్లాడుతూ జనవరి 12న పవన్ కళ్యాణ్ తలపెట్టిన యువశక్తి కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో యువతను పాల్గొనేలా ఏర్పాట్లు చేయమని హిత బోధ చేశారు. ఈ కార్యక్రమంలో జేఎస్పీ వారియర్స్ 2023 క్యాలెండర్స్ ను రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీటీసీ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు మరియు రూరల్ ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు యువశక్తి కార్యక్రమ సభ్యులు మరియు నాలుగు మండలాల నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు కలిసి పాల్గొన్నారు.