సావిత్రి బాయి ఫూలే సేవ‌లు మ‌రువ‌లేనివి: గురాన అయ్యలు

విజయనగరం: సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ లో గురాన అయ్యలు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. మహిళల కోసం సావిత్రిబాయి చేసిన సేవలను కొనియాడారు. సావిత్రిబాయి పూలే గొప్ప క‌వ‌యిత్రి, రచ‌యిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ అని కొనియాడారు. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్క‌రిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. కులమతాలకతీతంగా విద్యనభ్యసించే హక్కు అంద‌రికీ ఉంటుందని, అందుకే అందరూ చ‌దువుకోవాల‌ని, అందరూ సమానంగా బ‌తకాల‌ని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి అని అన్నారు.
నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, వంక నర్సింగరావు, వజ్రపు నవీన్ కుమార్, మేడేపల్లి పవన్ కుమార్, గొల్లపల్లి మహేష్, పసుమార్తి అభిలాష్, కంకిపాటి రాజు, ఏంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.