పి. గన్నవరం ఎంపీపీగా జనసేన నేత పాలూరి

పి.గన్నవరం: గన్నవరం మండలం, ప్రజా పరిషత్ తాత్కాలిక అధ్యక్షునిగా జనసేన పార్టీకి చెందిన నాగుల్లంక ఎంపీటీసీ-1 పాలూరి వీరభద్రరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డొక్కా నాద్ బాబు, అంబటి భూలక్ష్మి, సంసాని పెద్దిరాజు, సిరిగినీడి వెంకటేశ్వర రావు, సాధనాల శ్రీనివాసరావు (జె డి) యల్లమిల్లి చిట్టిబాబు, యర్రప్రగఢ గోపీ, ఆదిమూలం సూరయ్య కాపు, అనిబాబు, తాటికాయల శ్రీనివాస్, యడ్ల ఏసు, నాగలక్ష్మి పాలూరి ఫణి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.