రైల్వే కోడూరులో సావిత్రి భాయ్ పూలే జయంతి వేడుకలు

సావిత్రి భాయ్ పూలే జయంతి వేడుకలను రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ లోని విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఎవరు కాదన్నా నగ్నసత్యం ఇది భారతదేశంలో ఒక సామాన్య స్త్రీ విద్యను అభ్యసిస్తుంది అంటే కేవలం ఆ తల్లి సావిత్రి భాయ్ పూలే చలువ వల్లే. ఆమెను ఆదర్శంగా తీసుకొని, విద్యార్థులలో ఆమె పట్ల అవగాహన పెంచి ఆ తల్లి అడుగు జాడలలో నడవాలని పదిమందికి ఆదర్శ ప్రాయంగా నిలవాలని సమాజంలో స్త్రీకి జరుగుతున్న ఆన్యాయాని ఎదుకొంటు ప్రతి ఒక్కరూ ఒక సావిత్రి భాయ్ పూలే లా తయారు కావాలని తద్వారా స్త్రీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ తెలియజేస్తూ చరిత్ర పుటల్లో దాగివున్న ఈ నాటి సమాజం మరిచిన చరిత్ర మరవని సంఘటనలు ఎన్నో అవమానాలు, తిట్లు భౌతిక దాడుల నడుమ వాటిని ఎదుర్కుంటూ అస్పృశ్యత, బడుగు బహీనవర్గాలకు చెందిన ఆడబిడ్డలకు చదువు చెప్పిన ప్రథమ ఉపాధ్యాయురాలు జయంతి వేడుకలను నా తోటి జనసేన పార్టీ నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, అంకిసెట్టి మని, ఉత్తరాది శివకుమార్ మరియు సాయం సాగర్ తదితర కార్యకర్తలు, స్కూల్ ఉపాధ్యాయురాలు చేత నిర్వహించడం జరిగినది.