Pedana: అధికార పార్టీ నేతలు తీర ప్రాంతాల్లో భారీ స్కాం

పెడన నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న సముద్ర తీరం వేదికగా ప్రస్తుత ఏలిక పార్టీ నేతలు, గత పాలక పక్షం నాయకులు కలిసి వేల కోట్ల రూపాయిల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. కత్తి వెన్ను మండల తీర ప్రాంతం ఈ భారీ స్కామ్ కు వేదికగా నిలిచిందని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు రాం సుధీర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు గీసిందే గీత, రాసిందే రాత. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు సైతం ఇక్కడ పని చేయవు. మొన్నటి ఇంతేరు ఘటన తర్వాత తీర ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని స్థానిక జనసేన కార్యకర్తలు, నాయకులతో కలసి అక్కడికి వెళ్లాము. అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే నోట మాట రాలేదు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వేస్తున్నారు. ఇప్పుటికే వందల ఎకరాలు చెరువులుగా మారిపోయాయన్నారు. ఇప్పుటికీ రాత్రిళ్లు రణగొణ ధ్వనులతో భారీ యంత్రాలు పని చేస్తూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ వైసీపీ-టీడీపీ రాజ్యం నడుస్తోంది. పర్యావరణం, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఇక్కడ ఏఒక్కటీ పనిచేయదు. సముద్ర తీరానికి అతి సమీపంలో 100 మీటర్ల దూరం వరకుచెరువులు తవ్వేశారు. సముద్ర తీరంలో మడ అడవులను ధ్వంసం చేయడం నేరమని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ మడ అడవుల విధ్వంసం అడ్డదిడ్డంగా సాగుతోంది. వారి అధికారమదానికి భయపడో లేక ఇంకా ఏదైనా మభ్యపెట్టారో తెలియదన్నారు. అధికారులు ఈ విధ్వంసాన్ని పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు. సముద్రం నుంచి వచ్చే ఆటుపోటుల సమయంలో తీరప్రాంతం కోతకు గురవకుండా కాపాడే అత్యంత విలువైన మడ అడవుల్నినరికేస్తున్నా ఎవ్వరికీ స్టడం లేదు. ఇంతేరు – నిడమర్రు మధ్య రికార్డుల్లో సర్వే నంబర్ 94లో 3463 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందుకే ఇంత భారీ కుంభకోణం జరుతున్నా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నోరు మెదపడం లేదు. ఇప్పుటికే వందల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. సముద్ర తీర ప్రాంతం మొత్తం కాలుష్య కాసారంగా మారుతోంది. అటు తీర ప్రాంత గ్రామాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలకు తగబడేందుకు సిద్ధం చేసిన యంత్రాలను రెవెన్యూ సిబ్బంది సీజ్ చేసినదాఖలాలు లేవు. ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. జనసేన పార్టీ మాత్రం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంకు చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తవ్వేస్తుంకు రెవెన్యూ సిబ్బంది, అటవీ సిబ్బందిపట్టనట్టు ఉండడం వెనుక కారణాలు ఏంటో తేల్చాలి. అధికారుల నుంచిస్పందన రాని పక్షంలో ఆధారాలతో సహా న్యాయ స్పానం దృష్టికి తీసుకువెళ్తాం. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్తాం. పెడన తీరాన్ని భూబకాసురుల భారి నుంచి కాపాడేందుకు జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని మాటిస్తున్నామన్నారు. మొత్తం 33 వేల ఎకరాల్లో దోపిడికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకుని దోషులపై చర్యలు తీసుకుంటారో? కోర్టుబోను ఎక్కుతారో అధికారులు తేల్చుకోవాలని హెచ్చరించారు.