విజయవాడ, విశాఖలో త్వరలో సీ ప్లేన్ సౌకర్యం

ఏపీ లో పర్యాటకరంగం  అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సీ ప్లేన్  సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి జరుగుతోంది. రాష్ట్రంలో పర్యాటక బోటు కార్యకలాపాల పునరుద్ధణరకు తక్షణ చర్యలు చేపట్టినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.  ఇప్పటికే టూరిజంలో భాగంగా ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరయ్యాయి. విజయవాడ భవానీ ద్వీపంలో త్వరలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని వివరించారు. ఇక విశాఖ, దిండి, రాజమండ్రిలో పర్యాటక బోటు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. విజయవాడతో పాటు విశాఖలో కూడా సీప్లేన్ సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు స్పష్టంచేశారు.కోవిడ్ సమయంలో పర్యాటక శాఖకు రూ.22.5 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. శ్రీకాకుళం, విజయనగరంలో నూతన స్టేడియాలు నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కడప వైయస్సార్ స్పోర్ట్సుస్కూల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో ఏపీ యూత్ సర్వీసెస్ పేరిట ప్రత్యేక యూట్యూబ్ చానల్ ప్రారంభం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.