రెండవరోజు కాకినాడ సిటిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కాకినాడ సిటి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండవరోజున శనివారం కూడా కాకినాడ సిటిలో ముత్తా శశిధర్ సూచనలపై జనసైనికుల క్రియాశీలక సభ్యుల కిట్లను సాయంత్రం 4 గంటలకు కాకినాడ కలక్టరేటు పక్కన గల లేడీస్ క్లబ్లో పంపిణీ చేస్తూ వాలంటీర్లకి చిరుసత్కారం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చొరవతో సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రమాద భీమా పత్రాలను, సభ్యత్వ గుర్తింపు కార్డులతో కూడిన ఇతర పార్టీ సమాచార పత్రాలను అందచేయడం జరిగింది. ముందుగా సభ్యులను, వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సందేశాన్ని వినిపించి సభ్యులను సాదరంగా ఆహ్వానించడంతో మొదలై, నాయకులతో వాలంటీర్లను సత్కరించడం కొనసాగింది. పార్టీ అంటే మూలస్తంభాలైన కార్యకర్తలే అని ప్రజలకు పార్టీకి అనుసంధానం కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందని మరొక్కసారి అభినందనలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, సుంకర సురేష్, శ్రీమన్నారాయణ, మనోహర్ లాల్ గుప్త, ఆకుల శ్రీనివాస్, కోటేశ్వరరావు, బొడుపు అర్జున్, హరిక్రిష్ణ, మాలతి, భవాని, గంగాధర్, ఫణీంద్ర, వీరబాబు, దిండి రవి, మరియు వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.