జనసేన జనబాటకు ప్రజల నుండి అనూహ్య స్పందన

పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముక్కొల్లు గ్రామంలో ప్రారంభమైన జనసేన జనబాట. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను రూపొందించడం. ప్రజా మద్దతు కూడగట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జనసేన పార్టీ పట్ల ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంతో అవసరం అని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలియజేయడానికి జన బాట సరైన మార్గమని భావిస్తున్నారు. ముక్కొల్లు గ్రామంలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక పోతున్నామని, అమ్మిన నెలలు గడుస్తున్నా ఇంకా డబ్బులు చెల్లించలేదని వాపోతున్నారు. గ్రామంలో ఒక రైతు కూడా మద్దతు లభించలేదు. బస్తా 800 నుంచి వేయి రూపాయలలోపే అమ్ముకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1470/-. ముక్కొలు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రక్షిత మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నప్పటికీ ఫిల్టర్ బెడ్ పనిచేయకపోవడం వల్ల తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు. పంచాయతీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్ల గ్రామంలో అనేక పనులు పెండింగులో ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజాభిప్రాయం.