గిరిజన నిరుద్యోగుల భవిష్యత్ అమ్మకం ఇదే వైకాపా పరిపాలన తీరు

  • గిరిజన ఉపకులాల మధ్య వెబ్ సైట్ లో తొలగింపు చిచ్చు,
  • డా. వంపూరు గంగులయ్య జనసేన పార్టీ ఇన్చార్జ్ పాడేరు

పాడేరు: జనసేన పార్టీ నాయకులు పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాడేరు నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు పలు అంశాలపై తీవ్రంగా స్పందించారు జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. గంగులయ్య మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు. గత 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుంచి ఎస్టీ జాబితా లో నుంచి వాల్మీకి, గౌడు, బగత వంటి గిరిజన ఉపకులాల జాబితా తొలగించడం ప్రజలు ఆందోళనలు చేపడితే మళ్ళీ చేర్చడం ఇదేమి ప్రభుత్వ వైఖరో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కులాల మధ్య చిచ్చు రాజేసి రాక్షసనందం పొందడం బహుశా వైకాపా ప్రభుత్వ ప్రాథమిక పరిపాలన తీరు కావచ్చేమో ఇటువంటి విషయాలను తెలిసిన కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టడం తప్పా శాశ్వత పరిస్కారం దిశగా ఆలోచన చేయలేని అసమర్థ నాయకత్వం గిరిజన ప్రజాప్రతినిధుల సొంతం ఇటువంటి వారిని ఎన్నుకునేందుకు గిరిజన ప్రజలు ఒకేసారి తమ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఆలోసించాలి. గిరిజన నిరుద్యోగుల భవిష్యత్ ని అడ్డంగా అమ్ముకున్న వైకాపా నేతలు జీవో నెం 3 అమ్ముకున్నారని ప్రతి గిరిజన నిరుద్యోగ యువతి, యువకులు భావించాల్సి ఉంటుంది. మళ్ళీ అదే వైకాపా నేతలు ఇంకోసారి అధికార దాహంతో మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం గిరిజనులు గొర్రెలు మనల్ని నమ్మే బలి పశువులంటూ తమలో తామే నవ్వుకోకడం వైకాపా నేతలకు కొత్తేమి కాదు రానున్న ఎన్నికల్లో వీరిని గిరిజన ప్రాంత రాజకీయాలలో శాశ్వతంగా బహిష్కరించే పరిస్థితులు రావచ్చన్నారు.అలాగే పొత్తు ధర్మంలో భాగంగా తెదేపా నాయకులతో మంచి సఖ్యత కలిగివున్నప్పటికి ఆ పార్టీ నేతలు పాడేరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న రాజమండ్రి నారాయణ గారు ఇటీవలే జనసేనపార్టీ కోసం ఒక వ్యాఖ్య చేశారు గిరిజన ప్రాంతంలో జనసేనపార్టీ ఎటువంటి వ్యూహాత్మా ధోరణితో ఉందొ ఆయానకేమి తెలుసు గిరిజన పరిస్థితులు వారి రాజకీయాలపై ఒక గిరిజనేతర నేత మాట్లాడటం కచ్చితంగా అతని అవగాహనలేమియే కారణం మేము పొత్తు ధర్మాన్ని కచ్చితంగా పాటిస్తాం అధిష్టానం ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటాము కానీ మిత్ర పక్షము వాపుని బలుపు గా భావించి పొత్తు ధర్మాన్ని తప్పితే మేము కూడా ఒక అవకాశం తీసుకుంటాం గిరిజన మారుమూల పల్లెల్లో నాయకత్వంపై డోర్ టు డోర్ సర్వే చేస్తే ఎవరి బలాబలాలు ఏమిటో అర్ధమవుతుంది కాబట్టి అధిష్టానం నిర్ణయించకముందు జనసేనపార్టీ కోసం ఏదైనా వ్యాఖ్యలు చేస్తే అది కచ్చితంగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని శంకించినట్టుగా పాడేరు జనసేనపార్టీ నాయకత్వం భావించాల్సి ఉంటుందన్నారు. మాకు గిరిజన ప్రజల సమస్యలపై, హక్కులు, చట్టాలపై గిరిజన రాజకీయాలపై జోక్యం చేసుకుని పబ్బం గడుపుకునే పరాన్న జీవుల రాజకీయాలపై ఒక నిర్దిష్ట్యా మైన స్పష్టత ఉందని ఇవాళ గిరిజన ప్రజలకు పాలించే నాయకత్వంపై ఒక స్పష్టత ఉందని వారు సమర్ధవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారని ఎవరి ఆలోచనలతో పాలించి అసమర్థ విధానాలతో ఉన్న హక్కులు, చట్టాలు కోల్పోయే పరిస్థితి లో గిరిజన ప్రజలు లేరన్నారు. మిత్ర పక్షము మిత్ర ధర్మం పాటించాలని హితవుపలికారు. ఈ సమావేశంలో శ్రీ మతి శ్రీ కిట్లంగి పద్మ జిల్లా ఉపాధ్యక్షురాలు, అశోక్ పాడేరు నియోజకవర్గ ఐటి ఇన్చార్జ్, అధికార ప్రతినిధి శ్రీమతి శ్రీ బొంకుల దివ్యలత, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, సీసాలి భూపాల్, మసాడి సింహాచలం, పోతురాస గంగ ప్రసాద్, తాంగుల రమేష్, సత్యనారాయణ మజ్జి, బోయిన ప్రసాద్, చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.