జనసేనలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత బంగారి కనకరాజు

రామగుండం: జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు నచ్చి వారి ఆశయాలకు ఆలోచనలకు ఆహర్షితులై రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారి కనకరాజు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం, తెలంగాణ రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి మరియు రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ పాల్గొన్నారు.