డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి.. జనసేన వినతి పత్రం

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమాడ మండల కేంద్రములో 14 పంచాయతీలకు సంబంధించిన అన్ని గ్రామాల పిల్లలు డిగ్రీ చదవడానికి కదిరి తాలూకాకు వెళ్ళ వలసి వస్తుంది.. బస్సు ప్రయాణంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరీ ముఖ్యంగా ఆడ పిల్లలు చాలా దూరం బస్సు ప్రయాణాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల సమయానికి బస్సులు కూడా రాక పోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని చదువులు కూడా ఆపేసే ఆలోచనలో ఉన్నారు. కావున నల్లమాడ మండల కేంద్రంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయ్యాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ కు జనసేన పార్టీ తరుపున వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, నల్లమాడ మండల అధ్యక్షుడు బడిసం మహేష్, డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, సాయి ప్రభ, డేరంగుల రాజు తదితరులు పాల్గొన్నారు.