ముద్దినాయినపల్లిలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

తంబళ్లపల్లి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో, మొలకలచెరువు మండలం, ముద్దినాయినపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు సాయి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ చేతులమీదుగా జనసేన జెండా ఆవిష్కరణ, అలాగే బైక్ ర్యాలీ భాహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో సభ అధ్యక్షత మండల అధ్యక్షులు సాయి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలో జనసేన రాబోవు రోజుల్లో బలోపేతం చేయాలనీ, అలాగే మండల అధ్యక్షులు వారి మండల కార్యవర్గంలో మండలానికి 22 మంది చొప్పున జనసేన పార్టీ గురించి పార్టీ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను జనసేనాని మనోగతం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించటం జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంధకారం అవురించింది. ప్రజలంతా అల్లకల్లోలమైన పరిస్థితి, జగన్ రావాలి అన్న ప్రజలే జగన్ పోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు, ఈరోజు రైతులకు బిక్షం వేసినట్లు రూ.10,000 – 12,000 ఈ ముఖ్యమంత్రి ఇస్తున్నారు. రాబోవు రోజుల్లో జనసేన అధికారంలోకి వస్తే రైతే రాజు అన్నవిధంగా రైతుకు కాపుకు కావలసిన సదుపాయలు రైతులకి అందజేస్తూ రైతు మంచి దిగుబడితో వ్యవసాయం తీర్చిదిద్దేవిధంగా వారికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. రైతుకు గిట్టుబాటు ధరతో రైతును రాజునూ చేయాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రజలు పవన్ రావాలి జగన్ పోవాలి అంటున్నారు. మరొక సమస్య కలిగిన వ్యవస్థ భవన నిర్మాణం కార్మికులను వారికి రెక్క ఆడితేకాని డొక్కాడని బ్రతుకులు, వాళ్ళను ఆరు నెలల పాటు వారి కడుపులో మంట పెట్టి.. వాళ్ళ బ్రతుకుల్లో నిప్పులు చెల్లిన ముఖ్యమంత్రి పోవాలని కళ్యాణ్ వస్తే వారిని ఆదుకుంటారని, యువతకు ఉద్యోగ అవకాశం ఇస్తామని మసి పూసి మారేడుకాయి చేసినట్లు యువతకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి రూ.5000 తో బ్రతకలేని పరిస్థితి యువతకు కల్పించారు. లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు. యువత కోసం కళ్యాణ్ పరిశ్రమలు తెప్పించి యువతకు అండగా ఉంటాం అని చెప్పారు. పూర్తిగా మహిళలపైన రక్షణ లేకుండా పోయింది మహిళలకు రక్షణ, ఉద్యోగులకు సి.పి.ఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకుడు తర్వాత అసాధ్యం అని, అప్పట్లో తెలియక హామీ ఇచ్చామని చిన్నపిల్లల మాటలు చెబుతున్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థని కానీ, ఉపాధ్యాయులకు కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియటం జరిగింది. ఉద్యోగస్థులకు సి.పి.ఎస్ రద్దు చేస్తాం అని చెప్పటం జరిగింది రికమెండేషన్ లేకుండా ఉద్యోగులకు తమ పని చేసుకునే విధంగా వారికి వెసులుబాటు కలిగిస్తాం అని కళ్యాణ్ గారి తరుపున చెప్పటం జరిగింది. ప్రస్తుతం ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది ఆయనని గెలిపించాలని చూస్తున్నారు అటువంటి గొప్ప నాయకులని అధికారం చేపట్టే విధంగా పార్టీని భలోపేతం చేసేవిధంగా మండల అధ్యక్షులు క్రమశిక్షణ కలిగిన నాయకులను, జనసైనికులను ప్రతి రోజు కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను, ప్రతి ఒక్కరి గుండెల్లో జనసేన అనే కార్యక్రమం చేయాలనీ సందేశం ఇస్తూ, తంబళ్లపల్లి లోని జిల్లా కార్యవర్గం వారిని పర్యవేక్షిస్తు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని భలోపేతం చేయాలనీ డా.పసుపులేటి హరిప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి లోని 6 మండల అధ్యక్షులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షులు బత్తిన మధుబాబు, కార్యదర్శులు ఆనంద్, రెడ్డప్ప, బాబు, బాటసారి, మహిళా నాయకురాలు దారం అనిత తదితరులు పాల్గొనటం జరిగింది.