బోనాల ఉత్సవాలు: పలు ఆలయాలు సందర్శించి, పూజలు నిర్వహించిన నేమూరి

కూకట్పల్లి నియోజకవర్గం: బోనాల పండుగ శుభ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని, కెపిహెచ్బి కాలనీ డివిజన్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం మరియు బాలనగర్ డివిజన్, ఫతేనగర్ డివిజన్, బోయినపల్లి డివిజన్ అమ్మవారుల దేవాలయాలను దర్శించుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానం పొందాలని, తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, నాగరాజు, వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, చరణ్, అంజి, ఠాగూర్, ప్రసాద్ శంకర్, కళ్యాణ్, గోవింద్, వెంకట్, సాయి, ఆలయ కమిటీ సభ్యులు, జన సైనికులు, వీరమహిళలు మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.