రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నుండి సోమశిల వెళ్ళే ప్రధాన రోడ్డులో పాత దేవరాయ పల్లి వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు ప్రక్కన ఉన్న పొలాలలో ఉండే బంక మట్టి రోడ్డు మీద పేరుకుపోవడం జరిగింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు కొంత మంది జారి పడుతుండడం గమనించిన అనంత సాగరం మండలం జనసేన అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ రోడ్డు మీద పేరుకుపోయిన మట్టిని తొలగించడం జరిగింది. అదే విధంగా వర్షా కాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు, చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే జన సైనికులు కూడా రోడ్డు మీద మట్టిని తొలగించడం జరిగింది.