గూడపాటి గోపాలకృష్ణకు ఘనసన్మానం

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రత నిమిత్తం బులెట్ ప్రూఫ్ వాహనం మరియు జాకెట్స్ సమకూర్చేందుకు ముందుకు వచ్చి తన సహచరులతో కలిసి ప్రయత్నం చేస్తున్న ప్రవాస భారతీయులు, ఆప్తా మాజీ అధ్యక్షులు, సమాజ సేవకులు గూడపాటి గోపాలకృష్ణ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సందర్బంగా వారి గౌరవార్థం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఆలపాటి లక్ష్మీ నారాయణ నిర్వహిస్తున సాయి కౌశిక్ క్యాటరింగ్ ప్రాంగణములో గురువారం ఉదయం అల్పాహారంతో ఏర్పాటు చేసిన సమావేశంలో.. సమాజ సేవకులు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ అధ్యక్షతన గోపాలకృష్ణ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి మరియు కార్యాచరణకు పలు సూచనలు, సలహాలు చేశారు. కళ్యాణ్ గారి భద్రత విషయమై ఓటు నమోదు ప్రచారం నిర్వహించటానికి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బాగంగా వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి, రవీంద్రనాథ్ ఠాగూర్ దుట్టా, నందగిరి సతీష్, మండలి దయాకర్, పరంధామయ్య, కోటిలింగం, శ్యామ్ కిషోర్ పంగనామాల, గొల్ల సుభాష్ చంద్రబోస్, శ్రీనివాసరావు, పరమేష్, ఆకుల శశికాంత్, ఉగ్టె వెంకటేష్ పటేల్, దుర్గా ప్రసాద్, మత్తి శ్రీనివాస్ రావు, సుబ్బారావు, శ్రీమతి ఆకుల వెంకట లక్ష్మీ, శ్రీమతి యర్రంశెట్టి వెంకట సత్యవతి మరియు పెద్దలు తమ సందేశాన్ని ఇచ్చారు.. హైదరాబాద్ లోని జనసైనికులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు పాల్గొని గోపాలకృష్ణ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.