అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన శెట్టిబత్తుల రాజబాబు

అమలాపురం: బండారులంక విజ్ డమ్ స్కూల్ సమీపంలో చెత్త అంటించడం ద్వారా వ్యాపించిన కాలుష్యం వలన సుమారు 20 మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురై స్థానిక అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు జనసేన పార్టీ ప్రతినిధులు ఏరియా ఆసుపత్రిని సందర్శించి పిల్లలకు జరుగుతున్న వైద్య పరీక్షలు మరియు వారి ఆరోగ్య పరిస్థితి వైద్యాధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అమలాపురం పట్టణంలో ఇప్పటికే డంపింగ్ యార్డ్ లాంటి చెత్తాచెదారంతో ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. మరల ఇప్పుడు బండారులంకలో ఇటువంటిదే సమస్య జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అమలాపురం పట్టణం బండారులంకతో పాటుగా అమలాపురం పరిసర ప్రాంతాలన్నిటిలో డంపింగ్ యార్డ్ లో కాలుష్యం లేకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు ఆరోగ్యవకమైన వాతావరణం కల్పించాలని జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులుసందాడి శ్రీనుబాబు, ఆకుల బుజ్జి, గండి స్వామి, తాళ్ళ రవి, తూము రమేష్, ముత్తాబత్తుల శ్రీను, పొనకల ప్రకాష్, పోతుమూడి రవికుమార్, పెయ్యల స్వామి తదితరులు పాల్గొన్నారు.