వివాహా బంధంతో ఒక్కటైన ఆదిత్య, శ్వేతా అగర్వాల్

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ తాజాగా పెళ్లిపీటలు ఎక్కారు. నటి శ్వేత అగర్వాల్‌ను వివాహమాడాడు ఆదిత్య నారాయణ్. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్‌లో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదిత్య పెళ్లి వేడుక జరిగింది. కోవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ జంట పెళ్లి ఫోటోలు, ఆదిత్య తల్లి దీపా బరాత్‌లో సందడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి..

ఆదిత్య, శ్వేత అగర్వాల్ మధ్య షాపిత్ చిత్రం షూటింగ్ సమయంలో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. పదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఆదిత్య, శ్వేత దంపతులకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.