సింగరాజపల్లి మండల ఏర్పాటుకై పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ వినతి పత్రం

  • సింగరాజుపల్లిని మండలం చేయాలి.. పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్

జనగామ జిల్లా, సింగరాజుపల్లి మండలం పరిధి లోని కొన్ని గ్రామాలను విభజించి, కొత్త గ్రామాలను కలుపుకొని నూతన మండలంగా సింగరాజుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో దేవరుప్పుల తహసీల్దార్ కు వినతి పత్రం అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమములో జోగు భాస్కర్ మాట్లాడుతూ జాతీయ ఉత్తమ గ్రామం అవార్డు గెలిచినా సింగరాజుపల్లి గ్రామాన్ని మండలం చేస్తే మరింత అభివృద్ధి అవుతుందని, మండలానికి కావలసిన అన్ని సౌకర్యాలు, మరియు రహదారిని అనుకోని ఉన్నందున మండలం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్యక్షులు జోగు భాస్కర్, మరియు నరేంద్ర పవన్, రంజిత్, జోగు ఉదయ్, నలీన్, కర్రే శ్రీకాంత్, శేఖర్, జోగు శ్రీశైలం, అర్జున్, జోగు మహేష్, తదితరులు పాల్గొన్నారు.